బిగ్ బాస్ భామ, సైకిల్ కి మైలేజ్ ఇస్తుందా..!

Published on Nov 28, 2019 9:02 pm IST

ఈ ఏడాదికి గాను బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ గా ముగిసింది. సింగర్ రాహుల్ విజేతగా నిలిచాడు. కాగా ఈ సీజన్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ లో రాహుల్, పునర్నవి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. హౌస్ లో వీరి మధ్య నడిచిన కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన పునర్నవి ఆతరువాత ఐదారు సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది .కానీ ఆమెకు వచ్చిన గుర్తింపు మాత్రం శూన్యం. ఐతే బిగ్ బాస్ తరువాత ఆమె నటించే సినిమాలకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది సత్యం.

ప్రస్తుతం ఆమె ‘సైకిల్’ అనే ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. మహత్ రాఘవేంద్ర హీరోగా, శ్వేతా వర్మ మరో హీరోయిన్ గా నటిస్తుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం పునర్నవి క్రేజ్ తో మినిమమ్ వసూళ్లు దక్కించుకొనేలా కనిపిస్తుంది. హిట్ టాక్ తెచ్చుకుంటే సైకిల్ నిర్మాతల పంట పండినట్లే. మరి ఈ మూవీకి పునర్నవి క్రేజ్ ఏమాత్రం ఉపయోగపడుతుందో విడుదలైతే కానీ తెలియదు. అట్ల అశోక్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ ప్రసాద్, బాలాజీ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :