నేడు రాజమౌళి ప్రకటించనున్న నటులు వీరేనా?

Published on Nov 20, 2019 8:14 am IST

రాజమౌళి టీం నిన్న ఒక్కసారి గా సడన్ షాక్ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ మరియు విలన్ క్యారెక్టర్స్ ని పరిచయడం చేస్తున్నామంటూ ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలపై మరియు అనేక విషయాలలో లెక్కకు మించి రూమర్స్ టాలీవుడ్ లో సర్క్యులేట్ అవుతున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ టీం వీటన్నిటికీ సమాధానంగా ఈ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా 70% పూర్తయిందని చెప్పడం ద్వారా తాము ప్రకటించిన తేదీకే మూవీని విడుదల చేయనున్నామని పరోక్షంగా చెప్పారు. కాగా ఆర్ ఆర్ ఆర్ టీం ప్రకటించే రెండు పాత్రల పై అప్పుడే కొన్ని పేర్లు బయటకివచ్చాయి.

ఆర్ ఆర్ ఆర్ లో లేడీ విలన్ పాత్ర కోసం హాలీవుడ్ కి చెందిన సీనియర్ యాక్ట్రెస్ ఆలిసన్ డూడి ని తీసుకున్నారట. ఈమెది ఈ చిత్రంలో లేడీ నెగెటివ్ రోల్ అని సమాచారం. ఐర్లాండ్ కి చెందిన ఈ నటి ఇండియానా జోన్స్(1989),టాఫిన్, మేజర్ లీగ్ 2 వంటి చిత్రాలతో ఫేమస్ ఐయ్యారు . ఇటీవలి కాలంలో ఆలిసన్ డూడి 2017లో వచ్చిన డేవిడ్ సన్ 19 చిత్రంలో కనిపించారు. అలాగే మరో ఐరిష్ యాక్టర్ రేమండ్ స్టీవెన్సన్ కూడా నటించనున్నారని సమాచారం. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వరకు వేచివుండాల్సిందే.

సంబంధిత సమాచారం :

More