గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, జాన్వీ కపూర్ – చరణ్ లపై తీసిన ఓ సీక్వెన్స్ విషయంలో ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. నిజానికి ఈ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయినా.. అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేయాలని టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. మొత్తానికి బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ‘పెద్ది’ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.


