‘అజ్ఞాతవాసి’కి జరిగినట్టే జరుగుతుందా ?

Published on Feb 19, 2020 6:50 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంలోనూ ప్రసుతం బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్, క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూటింగ్ కు పవన్ ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. అయితే ముందుగా ఈ రెండు సినిమాల్లో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ కచ్చితంగా కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడని పవన్ ఫ్యాన్స్ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

కానీ పింక్ సబ్జెక్ట్ లో పక్కా కమర్షియల్ అంశాలకు చోటు లేదు, పైగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశించే ఓ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కి పెద్దగా స్పెస్ ఉండదు. మరి ఇలాంటి సినిమా పై ఫ్యాన్స్ అంచనాలు మరి ఎక్కువ పెట్టుకుంటే.. చివరికీ అజ్ఞాతవాసికి జరిగినట్టుగానే జరుగుతుందేమోనని నెటిజన్లు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడలి.

ఇక పవన్ – క్రిష్ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More