చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ పై ఈ రూమర్ కూడా నిజం అవుతుందా..?

Published on Feb 23, 2021 7:11 am IST

ఈ మధ్య కాలంలో మన ఇండియన్ సినిమా దగ్గర జస్ట్ అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ ను నమోదు చేసిన టాప్ 3 ప్రాజెక్ట్ లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ ల కాంబోలో ప్రకటించబడ్డ ప్రాజెక్ట్ ఒకటి. అయితే ఈ భారీ చిత్రం అధికారికంగా అనౌన్స్ కాకముందే ఓ టాక్ అయితే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

మరి దాన్ని నిజం చేస్తూనే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసింది. కానీ అదే సమయంలో ఈ చిత్రంలో చరణ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ఓ రూమర్ ఈ సెన్సేషనల్ కాంబో పై మరిన్ని అంచనాలు సెట్ చేసింది. అయితే మరి ముందు వచ్చిన రూమర్స్ ప్రకారం శంకర్ మరియు చరణ్ ల మధ్య ప్రాజెక్ట్ ఉందని కన్ఫర్మ్ అయ్యింది.

మరి అదే బాటలో వినిపించిన పవన్ పేరు కూడా ఫైనల్ అవుతుందా లేదా అన్నది కూడా ఒకింత ఆసక్తిగా అనిపిస్తున్న అంశమే..మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కానీ అదే టాక్ నిజం అయితే ఈ కాంబో ఖచ్చితంగా మరో లెవెల్ కు వెళ్లడం ఖాయం అని చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :