మరి మహేష్ నుంచి ఆ అప్డేట్ కూడా లేనట్టేనా.?

Published on May 27, 2021 5:04 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ రెండు సినిమాలు లైన్ లో పెట్టేసుకున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో దర్శకుడు పరశురామ్ పెట్లతో ప్లాన్ చేసిన సాలిడ్ మాస్ చిత్రం “సర్కారు వారి పాట” ఆల్రెడీ కొంత మేర షూట్ జరుపుకుంది కూడా.. అయితే ఈ సినిమా నుంచి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది అనగా లాస్ట్ మినిట్ లో మేకర్స్ ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆపేశాం అని తెలిపారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా టాక్ తో పాటుగా మే 31 నే త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమా నుంచి కూడా ఏదొక అప్డేట్ కానీ ముహూర్తం అయినా జరుగుతుంది అని టాక్ ఉంది. మరి ఆరోజున అదైనా ఉంటుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. దీనితో మరి అప్పటి వరకు ఎదురు చూపులు తప్పవు. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం హీరోయిన్స్ ఫైనలైజ్ అవుతుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :