విజయ్ దేవరకొండ రెండు సినిమాలతో ఒకేసారి రానున్నాడా ?

విజయ్ దేవరకొండ రెండు సినిమాలతో ఒకేసారి రానున్నాడా ?

Published on Jun 21, 2018 7:49 PM IST

గత ఏడాది’ అర్జున్ రెడ్డి ‘చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ . ఈ సినిమా తరువాత ఆయన స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు ఇక ఈ ఏడాది ఏ మంత్రం వేసావే , మహానటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వీటిలో ఏం మంత్రం వేసావే ఆలా వచ్చి ఇలా వెళ్లిపోయింది చాలా మందికి ఇది విజయ్ దేవరకొండ నటించిన సినిమా అని కూడా తెలియదు . ఇక దీని తరువాత ‘మహానటి’ చిత్రంలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలో నటించాడు ఈ సినిమా మంచి విజయం సాధించిన క్రెడిట్ అంతా కీర్తి సురేష్ కు వెళ్లిపోయింది.

ఇక ఈ సినిమాల తరువాత విజయ్ యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ‘టాక్సీవాలా ‘ చిత్రంలో నటించాడు షూటింగ్ కంప్లీట్ అయినా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ వల్ల ఇంకా విడుదలకు నోచుకోవట్లేదు ఈ చిత్రం అయితే జులై కల్లా పెండింగ్ వర్క్ ను పూర్తి చేసి ఆగష్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘గీత గోవిందం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ చిత్రాన్ని కూడా ఆగష్టు లో విడుదలచేయనున్నారని సమాచారం . మరి విజయ్ ఈ రెండు సినిమాలతో ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో త్వరలోనే తెలిసిపోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు