అదే జరిగితే ఇక భవిష్యత్తు వెబ్ సిరీస్ లదే !

Published on Aug 29, 2021 11:30 pm IST

డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోయాయి. అందుకే జనం కూడా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా కోరుకుంటున్నారు. అందుకే కొందరు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ ఫిల్మ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

పైగా సినిమాలుగా రాని ఎన్నో కథలు నెమ్మది నెమ్మదిగా గా సిరీస్ లుగా, స్ట్రీమింగ్ సైట్లలో సినిమాలుగా వస్తున్నాయి. దాంతో జనం వెబ్ సిరీస్లు చూడటానికే మక్కువ చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల సినిమా రంగానికి పరోక్షంగా కొంత నష్టం వాటిల్లుతుంది. అంబానీ లాంటి వారు భవిష్యత్తులో జియో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ లో ప్రైమ్ సభ్యత్వం ఉన్నవారికి వారి ఇంట్లోనే మొదటి రోజే మొదటి షో చూసే వెసులుబాటు కల్పిస్తాం అంటున్నారు. అదే జరిగితే ఇక భవిష్యత్తు వెబ్ సిరీస్ లు, వెబ్ సినిమాలదే.

సంబంధిత సమాచారం :