చరణ్ వల్ల “ఆచార్య” ఇంకో లెవెల్లో ఉంటుందట.!

Published on May 23, 2021 12:55 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య”. అలాగే ఈ చిత్రం మెగాస్టార్ సినిమానే అని కాకుండా మన తెలుగులో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రాల్లో ఒకటి. ఆ పరంగా కూడా దీనిపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.

అయితే చరణ్ ఎప్పుడు అయితే ఈ సినిమాలో ఉన్నాడని కన్ఫర్మ్ అయ్యిందో అక్కడే ఈ చిత్రం మరో లెవెల్ కి వెళ్ళింది. మరి ఇపుడు దానికి మరింత హైప్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక రకంగా చరణ్ కథనే చిరు తీసుకెళ్తారని చరణ్ స్పేస్ ఎలా లేదన్నా 40 నిమిషాలు ఉంటుందని దర్శకుడు కొరటాల తెలిపారు.

అంతే కాకుండా ఈ చిత్రం సిసలైన పాయింట్ కూడా చరణ్ రోల్ నుంచే స్టార్ట్ అవుతుందని కొరటాల మరో ఇంట్రెస్టింగ్ అంశాన్ని వెల్లడించారు. దీనిని బట్టి ఈ చిత్రంలో చరణ్ చేస్తున్న ‘సిద్ధ’ పాత్ర ఏ లెవెల్లో ఉండనుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :