“భీమ్లా నాయక్” హిందీ రిలీజ్ తో మరింత హైప్.?

Published on Feb 12, 2022 6:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మరో హీరో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రాన్ని ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీలో కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నామని నిర్మాత నాగవంశీ ఒక బిగ్ అనౌన్సమెంట్ నే అందించారు.

అయితే దీనిపై ఇంకా అధికారిక అనౌన్సమెంట్ అయితే రాలేదు కానీ హిందీ లో రిలీజ్ కూడా కన్ఫర్మ్ అని అందరికీ తెలిసిపోయింది. దీనితో ఇక్కడ నుంచి భీమ్లా నాయక్ పై మరింత హైప్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా హిందీ రిలీజ్ మంచిదే అని అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే ఇది వరకే పవన్ గతంలో తన సర్దార్ సినిమాతో వెళ్లి విఫలం అయ్యారు. ఇక ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందా అని ఈ సస్పెన్స్ అయితే నెలకొంది.

సంబంధిత సమాచారం :