సాలిడ్ సీన్ తో మెగాస్టార్ ఫిల్మ్ షురూ చేసిన దర్శకుడు.!

Published on Aug 13, 2021 9:00 am IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రం కంప్లీట్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉండగానే చిరు తన నెక్స్ట్ సినిమాల వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. అయితే ఆచార్య లాంటి స్ట్రైట్ సినిమా తర్వాత రెండు రీమేక్ సినిమాలు చేస్తుండగా వాటిలో మళయాళ సూపర్ హిట్ చిత్రం “లూసిఫర్” రీమేక్ కూడా ఒకటి.

భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు దర్శకుడు మోహన్ రాజా ఈరోజు నుంచే స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ స్టార్టింగ్ నే ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ తో షురూ చేసినట్టుగా తెలుస్తుంది. దర్శకుడు మోహన్ రాజా ఆన్ లొకేషన్ లో ఉండి ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్ మరియు ప్రముఖ స్టంట్ మాస్టర్ సిల్వ తో కలిపి ఫోటో షేర్ చేశారు. మరి దీనితో ఈ చిత్రం సాలిడ్ సీన్ తోనే స్టార్ట్ అయ్యినట్టు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :