మెగా ఫ్రేమ్ తో మరో లెవెల్ కి వెళ్తున్న “ఆచార్య”.!

Published on Mar 2, 2021 1:00 pm IST

కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు అంటే ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో తెలిసిందే. దానిని కనుక సరిగ్గా హ్యాండిల్ చేసే దర్శకుడు ఉంటే మరి ఆ సినిమా బాక్సాఫీస్ ను కూడా మోత మోగిస్తుంది. మరి అలాంటి కొన్ని బడా మల్టీ స్టారర్ చిత్రాలు టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ఉన్నాయి.

ఒకటి ఎన్టీఆర్ మరియు చరణ్ ల కాంబోలో రాజమౌళి తీస్తున్న “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి ఇదే రామ్ చరణ్ తో తండ్రి మెగాస్టార్ చిరు హీరోగా బ్లాక బస్టర్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న “ఆచార్య” ఒకటి. మరి ఈ చిత్రంపై మాత్రం అంచనాలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయానే చెప్పాలి.

ముఖ్యంగా చరణ్ ‘సిద్ధ’మైనప్పటి నుంచి వేరే లెవెల్ కు ఈ సినిమా వెళ్ళింది. మరి అలాగే లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన మెగా ఫ్రేమ్ చూసి అయితే మెగా ఫ్యాన్స్ కు ఎనలేని అంచనాలు ఏర్పడ్డాయి. చిరు మరియు చరణ్ లతో కొరటాల ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని క్రిస్టల్ క్లియర్ అవుతుంది.

సంబంధిత సమాచారం :