ప్రముఖ నిర్మాణ సంస్థతో బాలయ్య కన్ఫర్మా.?

Published on May 2, 2021 8:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ పవర్ ఫుల్ సబ్జెక్టు అనంతరం బాలయ్య లైనప్ లో మరో ఇద్దరు టాప్ దర్శకులు ఉన్న సంగతి కూడా తెలిసిందే. మరి ఇదే సమయంలో బాలయ్యతో సినిమా చేసేందుకు మన టాలీవుడ్ కు చెందిన ఒక టాప్ అండ్ ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీగా ఉందట.

వారు మరెవరో కాదు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలలో ఒకరైన హారికా హాసిని వారే.. మొత్తానికి కాంబినేషన్ లో బాలయ్యతో సినిమా రానున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే బాలయ్య ఏ దర్శకునితో సినిమా చేయనున్నారో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి పేర్లు బాలయ్య అండర్ లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :