బాహుబలి లెక్క ఆర్ఆర్ఆర్ హీరోలకు కండలు అవసరం లేదా?

Published on Sep 23, 2019 4:02 pm IST

దర్శకధీరుడు రాజమౌళి నేతృత్వంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంతో దూసుకెళుతుంది. ఇటీవలే బల్గెరియా వెళ్లిన చిత్ర బృందం అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. అక్కడ షెడ్యూల్ పూర్తికావడంతో చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కొరకు సమాయత్తం అవుతుంది. రాబోవు షెడ్యూల్ నందు రాంచరణ్ పాల్గొననున్నారట.

కాగా బాహుబలిలో ప్రభాస్, రానాలను కండలు తిరిగిన బీస్ట్ మోడ్ లో ప్రెసెంట్ చేసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లను సాధారణ శరీర సౌష్టవం కలిగినవారిగా చూపించబోతున్నాడని అర్థం అవుతుంది. ఎందుకంటే దాదాపు 50శాతం చిత్రీకరణలో పాల్గొన్న ఎన్టీఆర్, చరణ్ లు భయంకరమైన కండలు పెంచిన దాఖలాలు లేవు. ఆ మధ్య స్టీవ్ లాయిడ్స్ నేతృత్వంలో ఎన్టీఆర్ కఠిన కసరత్తులు చేస్తుంటే కొమరం బీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ కండలు పెంచుతున్నాడు అనుకున్నారంతా. కానీ తాజాగా బయటకివచ్చిన ఫోటో ఎన్టీఆర్ ఒళ్ళు చేయకపోగా ఇంకా చిక్కిపోయినట్లు అనిపించారు. దీనితో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ లో సాధారణ శరీరాలలోతోనే కనిపిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తుండగా, అజయ్ దేవ్ గణ్, అలియా భట్, సముద్ర ఖని వంటి నటులు ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More