వరల్డ్ ఫేమస్ లవర్ నష్టాలు ఎంతంటే..?

Published on Feb 22, 2020 4:13 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తో నడిచిన ఈ చిత్రం భారీ నష్టాల దిశగా వెళుతుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై వారం గడిచిపోయింది. కొత్త సినిమాల రాకతో ఇంకా వసూళ్లు నెమ్మదించాయి. మొత్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పెద్ద మొత్తంలో నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. 30కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిసినెస్ జరిపిన ఈ చిత్రం కనీసం 10కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. దీనితో 50 శాతానికి పైగా నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.

దర్శకుడు క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా రాశి ఖన్నా, క్యాథెరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More