యూట్యూబ్ లో సత్తా చాటుతున్న వరల్డ్ ఫేమస్ లవర్

Published on Jan 5, 2020 1:02 am IST

అర్జున్ రెడ్డి చిత్రం తో యువత మనసు కొల్లగొట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబందించిన టీజర్ తాజాగా విడుదల అయింది. అయితే టీజర్ విడుదల అయినా 24 గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్ తో 268k లైక్స్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో వున్నది. అయితే ఇప్పటివరకు తెలుగు సినిమాలకి సంబందించి ఈ చిత్రం టాప్ 10 మూవీస్ లో అత్యధిక వీక్షణలను 24 గంటల్లో సాధించిన టీజర్ గా వుంది.

ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ చిత్ర టీజర్ వ్యూస్ ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 14 న విడుదల కి ఈ చిత్రం సిద్ధంగా వున్నది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, క్యాథెరిన్ థెరిసా, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :