‘వకీల్ సాబ్’ వరల్డ్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ !

Published on Jul 11, 2021 10:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ థియేటర్స్ లో కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పుడు టెలివిజన్ లో కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయింది వకీల్ సాబ్. ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జీ తెలుగు సంస్థ, వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను జులై 18న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేస్తోన్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కాగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదల అయ్యి సాలిడ్ ఓపెనింగ్స్ ని సాధించి, కరోనా కాలంలో కూడా జనాన్ని థియేటర్స్ కి రప్పించింది. ఆ తరువాత కొన్ని రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలి కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ అయింది.

సంబంధిత సమాచారం :