తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ది గ్రేట్ ఖలీ !

Published on Jan 30, 2019 11:23 am IST

ప్రముఖ దర్శకుడు జయంతి సి పరాన్జీ ప్రస్తుతం ఇండో -పాక్ నేపథ్యంలో ‘నరేంద్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో డబ్ల్యు డబ్ల్యు ఈ స్టార్ ది గ్రేట్ ఖలీ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రం తో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఖలీ ఇంతకుముందు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు అలాగే హిందీలో బిగ్ బాస్ 4 సీజన్ లో కూడా పాల్గొన్నాడు.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ నరేంద్ర చిత్రంలో నీలేష్ ఏటి , ఇజబెల్లి లేటి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ సంపంత్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :