ఇంట్రెస్టింగ్‌గా ‘యముడు’ మూవీ న్యూ పోస్టర్

ఇంట్రెస్టింగ్‌గా ‘యముడు’ మూవీ న్యూ పోస్టర్

Published on Apr 26, 2025 7:30 AM IST

Untitled 48

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలో జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు.

ఇది వరకు రిలీజ్ చేసిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో జగదీష్ అందరినీ భయపెట్టించేశారు. వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఇలా అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేసిన తీరు, యముడి ఆహార్యంలో హీరో కనిపించిన తీరు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు