‘టాక్సిక్’ నుంచి టికెట్ గా యష్.. ఊర మాస్ రెండో లుక్!

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి అలాగే తారా సుతారియా లాంటి హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రమే “టాక్సిక్”(Toxic). భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ కి ఒకింత మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే ఇందులో రాకింగ్ స్టార్ యష్ మొత్తం మూడు షేడ్స్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక యంగ్ పాత్ర కూడా ఉంది. దీనిని టీజర్ లో కంప్లీట్ గా చూపించలేదు కానీ లేటెస్ట్ గా యష్ షేర్ చేసిన పోస్టర్ తో మాత్రం ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇందులో యష్ పూర్తిగా షేవింగ్ లుక్ లో మాస్ అండ్ రగ్గుడ్ గా కనిపిస్తుండగా ఈ పాత్ర పేరు ‘టికెట్’ గా పరిచయం చేశారు.

ఈ టికెట్ నరకానికి టికెట్ అంటూ రివీల్ చేసిన పోస్టర్ లో యష్ మంచి వైలెంట్ గా కనిపిస్తున్నాడు. మరి సినిమాలో ఈ రోల్ ఇంకెలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా యష్, కే వి ఎన్ ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే ఈ మార్చ్ 19న సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version