వెరీ పవర్ఫుల్ గా “కేజీయఫ్ 2” నుంచి రాకీ భాయ్ డేంజరస్ పోస్టర్.!

Published on Jan 8, 2022 9:09 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఇండియన్ సినిమా దగ్గర మళ్ళీ ఓ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ సినిమా ఇది.

అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రాకీ అనే ఈ పాత్ర మూవీ లవర్స్ ప్రతి ఒక్కరిని ఎంతో ప్రభావితం చేసింది. మరి ఆ రోల్ ని అద్భుతంగా చేసిన యష్ పుట్టినరోజు ఈరోజు కావడంతో మేకర్స్ ఓ అదిరే పోస్టర్ ని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి చెప్పినట్టు గానే ఈ పోస్టర్ ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

ఇది మాత్రం అంచనాలకు తగ్గట్టు గానే సాలిడ్ పోస్టర్ ని మేకర్స్ వదిలారు. మనం చూస్తూ ఉంటాంగా డేంజర్ బోర్డులు వాటి వెనుక రాకీ ని పెట్టి అతడితో పెట్టుకుంటే మీకు డేంజర్ తప్పదు అన్నట్టుగా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇది మాత్రం అదిరే లెవెల్లో పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. అలాగే ఇందులోనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14 నే రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ హోంబలె ఫిల్మ్స్ వారు కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :