కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా చేస్తున్న అవైటెడ్ సినిమా “టాక్సిక్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు మాస్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో అనేకమంది హీరోయిన్స్ ఉన్నారు. కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి అలాగే తారా సుతారియా లాంటి బ్యూటీలు ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించారు.
అయితే ఇంతమంది హీరోయిన్స్ ఎందుకు వీరేం చేస్తారు అనే దానికి సమాధానం ఇచ్చేందుకు యష్ టైం ఫిక్స్ చేసాడు. ఈ జూలై 1 ఉదయం 11 గంటల 33 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమాలో అంత మంది హీరోయిన్స్, ఇతర లేడీస్ కోసం రేపు క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కాబోతోంది.
Calm down !
Ladies take time to come!Tomorrow, 01-07-2026, 11:33 AM, https://t.co/LSFY5GBDAc #ToxicTheMovie https://t.co/19Yi1cZxCr
— Yash (@TheNameIsYash) June 30, 2026


