సల్మాన్ రాధే తో జాయిన్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్

Published on Feb 25, 2020 2:18 am IST

ఇటీవల దబంగ్ 3 సినిమాతో వెండితెరపై మెరుపులు మెరిపించారు హీరో సల్మాన్ ఖాన్ మరియు దర్శకుడు ప్రభుదేవా. వీరిద్దరూ మరో చిత్రం కొరకు జతకట్టారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం రాధే. ఈ ఏడాది రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలు కాగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ మరియు అతుల్ అగ్నిహోత్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ దక్కించుకుంది.

రాధే చిత్రాన్ని రంజాన్ కానుగా ఇండియా వైడ్ గా యష్ రాజ్ ఫిలిమ్స్ విడుదల చేయనుంది. ఈ మేరకు నేడు ప్రకటన రావడం జరిగింది. ప్రతి ఏడాది రంజాన్ కానుకగా సల్మాన్ ఓ మూవీ విడుదల చేస్తారు. ఇక ఈ చిత్రంలో సల్మాన్ కి జంటగా దిశా పటాని నటిస్తుంది.

సంబంధిత సమాచారం :