రాఖీ భాయ్ హైదరాబాద్ రానున్నాడు.. ఇక్కడే అంతా ముగిస్తాడట

Published on Nov 25, 2020 3:00 am IST


‘కెజిఎఫ్’ సినిమా విజయంతో ‘కెజిఎఫ్ 2’ మీద భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈమధ్య కాలంలో ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సౌత్ ఇండియన్ సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ ఇండస్ట్రీలోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ప్రస్తుతం పార్ట్ 2 కోసం దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లో మొదలుకానుంది. హీరో యష్ రేపు హైదరాబాద్ బయలుదేరనున్నారు.

ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తికానుంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడ పాల్గొననున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది కానీ లేకుంటే ఈపాటికే సినిమా విడుదలైపోయేది. తాజా సమాచారం మేరకు 2021 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్ద సమయం లేకపోవడంతో ఇంకా విడుదల కన్ఫర్మ్ కాలేదు. అయితే 2021 ప్రథమార్థంలో విడుదలవడం మాత్రం ఖాయం అంటున్నారు. ఇందులో కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్టుండగా రవీనా టాండన్ ఒక కీ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More