న్యూ ఇయర్ రోజు యాత్ర నుండి సాంగ్ విడుదలకానుంది !

Published on Dec 30, 2018 6:51 pm IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇక ఈచిత్రం నుండి న్యూ ఇయర్ రోజు జనవరి 1న సాయంత్రం 5గంటలకు ‘రాజన్న’ అనే లిరికల్ సాంగ్ విడుదలచేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కు సంబందించిన విశేషాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :