‘యాత్ర’లో వైఎస్. జగన్ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 19, 2018 8:18 pm IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. మమ్ముట్టి బాగా ఇన్ వాల్వ్ అయి వైఎస్సార్ రోల్ లో నటిస్తున్నారని చెబుతుంది చిత్రబృందం. వైఎస్సార్ హావభావాలు దగ్గరనుంచి, ఆయన మాట తీరు, ఆయన నడక ఇలా ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్త తీసుకుని నటిస్తున్నారట.

అయితే వైఎస్. జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో అనే విషయం మాత్రం చిత్రబృందం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగన్ ప్రస్తావన చాలా సందర్భాల్లో వస్తుందట. జగన్ పాత్ర మాత్రం చాలా తక్కువ సమయం మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తోందని తెలుస్తోంది. అంటే ఓ గెస్ట్ రోల్ లా జగన్ పాత్ర సినిమాలో కనిపించనుంది.

కాగా ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ గాని, లేదా తమిళ్ స్టార్ కార్తి గాని నటించనున్నారని గతంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, విజయ్ మాత్రం జగన్ పాత్రలో కనిపిస్తే.. యాత్ర పై మరింత అంచనాలు పెరుగుతాయి.

ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం :