జగన్ బర్త్ డే కు ‘యాత్ర’ టీజర్ !

జగన్ బర్త్ డే కు ‘యాత్ర’ టీజర్ !

Published on Dec 18, 2018 6:00 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని’ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను వైస్సార్ తనయుడు జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21న విడుదలచేయనున్నారు. ఈచిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కు సంబందించిన విశేషాలను ప్రస్తావించనున్నారు.

జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు