యాత్ర మొదటి రోజు కలక్షన్ల వివరాలు!

Published on Feb 9, 2019 5:35 pm IST

లెజండరీ పొలిటీషియన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 2.76 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఈరోజు ,రేపు ఈచిత్రం మంచి వసూళ్లను రాబట్టనుంది.

ఈచిత్రంలో వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

 

 

ఏరియా కలెక్షన్స్
నైజాం 0.62 కోట్లు
సీడెడ్  0.42 కోట్లు
గుంటూరు 0. 46 కోట్లు
వైజాగ్ 0.14కోట్లు
తూర్పు గోదావరి 0.10కోట్లు
పశ్చిమ గోదావరి 0.16 కోట్లు
కృష్ణా 0.19 కోట్లు
నెల్లూరు 0.17కోట్లు
ఓవర్సీస్ 0.5 కోట్లు
మొత్తం 2. 76 కోట్లు

సంబంధిత సమాచారం :