‘బలగం’తో తొలి ప్రయత్నంలోనే ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి, ఇప్పుడు తన రెండో చిత్రం ‘ఎల్లమ్మ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో తొలుత నాని, నితిన్‌ల పేర్లు వినిపించినా, ఇప్పుడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సినిమాను ఎప్పుడో ఓకే చేసినా, ఇంకా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అయింది. కాగా, సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు ప్రత్యేక గ్లింప్స్ వీడియోను రూపొందిస్తున్నట్లు సమాచారం. డీఎస్‌పీ హీరోగా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశముంది. హీరోయిన్ విషయంలోనూ ఆసక్తి నెలకొంది. తొలుత పరిశీలనలో ఉన్న సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు ప్రస్తుతం లేవని టాక్ వినిపిస్తోంది.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఎల్లమ్మ మూవీలో దేవిశ్రీ నటుడిగా ఎలా మెప్పిస్తాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అధికారిక ప్రకటనతో పాటు తదుపరి అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


