నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి

నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి

Published on May 14, 2014 7:22 PM IST

Kaanchi
వరుసగా మూడు హిట్స్ అందుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమాలు చేయడంలో కాస్త స్లో అయ్యాడు. ‘హార్ట్ అటాక్’ సినిమా విడుదలై మూడు నెలలు పూర్తైనా మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా మొదలు పెట్టినా ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది.

అది ఆగిపోయినా నితిన్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాని పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. మిస్తి ‘కాంచి’ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం అయ్యింది. నితిన్ సినిమాతో టాలీవుడ్ లో పరిచయం కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు