మరోసారి మెగాస్టార్ సాంగ్ రీమేక్ లో సుప్రీం హీరో

మరోసారి మెగాస్టార్ సాంగ్ రీమేక్ లో సుప్రీం హీరో

Published on Oct 12, 2015 10:27 AM IST

sai-darm-teja
ఈ మధ్య కాలంలో యువ హీరోలు అంతా అలనాటి స్టార్ హీరోల సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూ ఆ సినిమా ఆల్బమ్ కి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో చాలా కామన్ గా జరుగుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా కెరీర్ ప్రారంభించిన సాయిధరమ్ తేజ్ మూడావ సినిమాతోనే ఒకప్పటి చిరు సుప్రీమ్ హీరో పేరుని తనకి ట్యాగ్ లైన్ గా మార్చుకున్నాడు. ఇటీవలే వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా సాయిధరమ్ తేజ్ కి మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేసిన సాయిధరమ్ తేజ్ తన రెండు సినిమాల్లో మెగాస్టార్ చిరు సినిమాల్లోని రెండు హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేసాడు. ‘రేయ్’ సినిమాలో ‘గోలీమార్’ పాటని రీమిక్స్ చేస్తే, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ‘గువ్వా గోరింకతో’ సాంగ్ ని రీమిక్స్ చేసారు. ఇప్పుడు తాజాగా మరో సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేయనున్నాడు సాయిధరమ్ తేజ్. యముడికి మొగుడు సినిమాలో బాగా ఫేమస్ అయిన అందం ఇందోలం, ఆదరం తాంబూలం’ పాటని సాయిధరమ్ తేజ్ తన తదుపరి సినిమా ‘సుప్రీమ్’లో రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు