ఈ మూవీతో నాలోని ఉగ్రరూపాన్ని చూడబోతున్నారు – ‘ఉగ్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లరి నరేష్

ugram 1
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఉగ్రం. మిర్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. మే 12న వేసవి కనుకగా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ యూనిట్ మొత్తం కూడా ప్రతి ఒక్క రోజు 17 గంటలకు పైగా కష్టపడ్డారని అన్నారు. యూనిట్ మెంబర్స్ లోని సమిష్టి కృషితోనే ఉగ్రం మూవీ తెరకెక్కిందని తెలిపారు. దర్శకుడు విజయ్ తో పని చేయడం అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని తెలిపారు. ఇప్పటి వరకు నాలోని కామెడీ, యాక్షన్ యాంగిల్ ని చూసారు, కానీ ఈ మూవీ ద్వారా నాలోని ఉగ్రరూపాన్ని చూడబోతున్నారు. తప్పకుండా మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు అల్లరి నరేష్.

Exit mobile version