బన్నీ సినిమాలో ఎమ్మెల్యేగా హీరోయిన్!

బన్నీ సినిమాలో ఎమ్మెల్యేగా హీరోయిన్!

Published on Oct 9, 2015 1:00 AM IST

catherine-tresa
‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు భోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ‘సరైనోడు’ అన్న వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో భోయపాటి బ్రాండ్ భావోద్వేగంతో పాటు బన్నీ స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలుపుకొని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, క్యాథిరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో క్యాథరిన్ థెరిసా పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది.

సరైనోడులో క్యాథరిన్ ఓ ఎమ్మెల్యేగా కనిపించనున్నారట. క్యాథరిన్ లాంటి గ్లామరస్ నటి ఎమ్మెల్యే పాత్రలో నటించనుండడం వైవిధ్యమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన రోల్ కూడా స్పెషల్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇప్పటివరకూ కనిపించని ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు