ప్రశాంత్ వర్మ కొత్త ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రేపే.!

Published on May 28, 2021 11:00 am IST

మన టాలీవుడ్ లో రైజ్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. తన మొదటి సినిమా ‘అ!’ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా ఈ దర్శకుడు నెక్స్ట్ తీసిన కల్కి మరియు “జాంబీ రెడ్డి” వరకు కొత్త సబ్జెక్టులతో టాలీవుడ్ ను మరోసారి జాతీయ స్థాయిలో మెరిశాడు. మరి అలాగే ఈ చిత్రం అనంతరం కూడా తన దగ్గర ఎన్నో సరికొత్త జానర్ సబ్జెక్టులు ఉన్నాయని వాటిలో ఒకటి ఓ స్టార్ హీరోతో కూడా చేస్తానని తెలిపారు.

అయితే ప్రశాంత్ వర్మ నుంచి సరికొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ కానుంది అన్నది ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది రేపు మే 29న ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్సమెంట్ తో పాటుగా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారట. అలాగే ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా ఓ పోస్టర్ ద్వారా ప్రకటిస్తారట. మరి ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :