ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన యంగ్ కమీడియన్ !

Published on Feb 23, 2019 9:22 pm IST

పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిఠాయి. ప్రశాంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం దారుణమైన రేటింగ్స్ రాబట్టుకుంది. క్లారిటీ లేకుండా తీసిన ఈ డార్క్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా విసిగించింది. ఇక తాజాగా రాహుల్ రామకృష్ణ ఓటమిని అంగీకరించి ప్రేక్షకులను క్షమాపణ కోరాడు.

సినిమా ఫలితాన్ని ముందే ఊహించానని అందుకే సినిమా ప్రమోషన్స్ కు కూడా దూరంగా ఉన్నానని అన్నాడు, సినిమాకు రిపేర్లు చేద్దామని ట్రై చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని థియేటర్లలో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినందుకు మన్నించాలని అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు రాహుల్.

సంబంధిత సమాచారం :