హ్రితిక్ మెచ్చిన యువ డాన్సర్..!

Published on Jan 15, 2020 9:00 pm IST

ఓ యువ డాన్సర్ చేసిన మైకేల్ జాక్సన్ మూవ్మెంట్స్ ఇండియా లోని బెస్ట్ డాన్సర్స్ లో ఒకరైన హ్రితిక్ రోషన్ ని కదిలించాయి. ఆయన ట్విట్టర్ వేదికగా ”నేను చూసిన స్మూతెస్ట్ ఎయిర్ వాకర్.. ఎవరీ కుర్రాడు?” అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. హృతిక్ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే హ్రితిక్ రోషన్, ఇటీవల నితిన్-రష్మిక జోడీ చేసిన డ్యాన్స్‌పై కూడా స్పందించారు. తాజాగా ఈ యంగ్ మైఖేల్ చేసిన డ్యాన్స్‌ను చూసిన హృతిక్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎవరీ కుర్రాడు అంటూ అతనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

హ్రితిక్ ఆ కుర్రాడి డాన్స్ ని ప్రశంసిస్తూ రీట్వీట్ చేసిన వెంటనే ఆ వీడియో వైరల్ గా మారింది. అనేక మంది తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఐతే అతడు జోధ్‌పూర్‌కు చెందిన యువరాజ్ సింగ్ అని తెలిసింది. బాబాజాక్సన్‌గా టిక్ టాక్‌లో తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. మైఖేల్ జాక్సన్ చేసినట్టుగా చాలా సింపుల్‌గా డ్యాన్సులు చేస్తుంటాడు. మరి హ్రితిక్ దృష్టిలో పడిన ఈ కుర్రాడి ఫేట్ మారుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More