యంగ్ విలన్ హఠాన్మరణం, హీరో భావోద్వేగ ట్వీట్.

Published on Jul 11, 2019 10:20 am IST

నటుడు అమిత్ పురోహిత్ నిన్న అనుకోకుండా మరణం చెందారు. అమిత్ పురోహిత్ మరణ వార్తను హీరో సుధీర్ బాబు ఓ భావోద్వేగ ట్వీట్ చేసిపంచుకున్నారు. అమిత్ పురోహిత్ మరణవార్త చాలా విచారానికి గురిచేసింది, ‘సమ్మోహనం’ చిత్రంలో ఆయన అమిత్ మల్హోత్రా అనే విలన్ రోల్ చేశారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న హార్డ్ వర్కింగ్ యాక్టర్. మరో యువ నటుడు అకాలమరణం చెంది మనల్ని విడిచిపోయారు, ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను, అని ట్వీట్ చేశారు.

అమిత్ పురోహిత్ తెలుగులో “సమ్మోహనం” చిత్రంతో పాటు,శోభనాస్ సెవెన్ నైట్స్ ,ఆలాప్ చిత్రాలలో నటించడం జరిగింది. ఆయన హఠాన్మరణం వెనుక కారణాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More