కొత్త సినిమాలకు సిద్దమవుతున్న యంగ్ హీరో !
Published on Sep 29, 2017 1:11 pm IST

‘ఆ ఐదుగురు’ చిత్రంలోని హీరోల్లో ఒకరిగా నటించిన యంగ్ హీరో తనిష్క్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దర్పణం’ సినిమాలో సోలో హీరోగా కనిపించనున్నాడు. ప్రవీణ్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కే డైరెక్ట్ చేస్తున్నారు. 9 ఏళ్ల సినీ కెరీర్లో సోలో హీరోగా అవకాశం దొరికిన ఈ సినిమా కోసం తనిష్క్ బరువు తగ్గి ఫిట్ గా కనిపించేందుకు సిద్దమవుతున్నాడు.

ఈ చిత్రంలో తనిష్క్ తన నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్, డాన్స్ లలో తన ప్రతిభను చూపించనున్నారట. ఈ సినిమా కాకుండా ఈ యువ హీరో చేతిలో ఇంకో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలు కోసం కూడా తనిష్క్ అన్ని విధాలుగా రేడీ అవుతున్నాడట. ఈ చిత్రాలతో పాటు ప్రస్తుతం చేస్తున్న ‘దర్పణం’ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook