ఆ హీరో రాకతో ఓ అభిమాని మృతి !

Published on Aug 5, 2018 9:25 am IST


మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా తమ అభిమాన హీరో వస్తున్నాడని ఎంతో ఉత్సాహంగా వచ్చిన హరి అనే ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన శనివారం కేరళలోని కొల్లం ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కి హరి వీరాభిమాని. కాగా ఓ మాల్ ప్రారంభోత్సవానికి దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. దాంతో అభిమానులందరూ దుల్కర్ సల్మాన్ చూడడానికి ఎగబడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

ఆ సమయంలో హరి గుండె పోటుతో పడిపోయారు. అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. హరి త్రివేండ్రంకు చెందిన వ్యక్తి అని అతనికి గతంలోనూ గుండె స్ధంబనకు గురైన సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది. ఐతే సరైన జాగ్రత్తలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పోలీసులు మాల్ యజమానం పైన కేసు ఫైల్ చేశారు.

సంబంధిత సమాచారం :

X
More