యంగ్ హీరోకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన నిర్మాత !
Published on Feb 27, 2018 3:35 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం ‘ఛలో’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రమే సోలో హీరోగా శౌర్యకు పెద్ద కమర్షియల్ హిట్ . ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమాలు కూడ కొంత భిన్నంగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడీ హీరో.

ఇదిలా ఉండగా ‘ఛలో’ విజయానికి గుర్తుగా ఆ చిత్ర నిర్మాత, శౌర్యకు తల్లి అయిన ఉష మల్పూరి ఈరోజు ఉదయం అతనికి ఖరీదైన పోర్షె కారును బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఈ యువ హీరో మే నెల నుండి శ్రీనివాస్ అనే నూతన దర్శకుడితో ‘నర్తనశాల’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు.

 
Like us on Facebook