బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర క్యారెక్టర్ అదే ?

Published on Nov 29, 2020 3:00 am IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నవీన్ చంద్రది విలన్ క్యారెక్టర్ అని.. ఓ మినిస్టర్ కొడుకుగా నటించబోతున్నాడని తెలుస్తోంది. పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది. ఇక నవీన్ చంద్ర, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

కాగా తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఈమేజ్ తెచ్చుకున్న న‌వీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన సినిమా భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఈ లాక్ డౌన్ లో విడుదలై మంచి నేమ్ తెచ్చుకుంది. ఇక బాలయ్య సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More