“ధర్మహా” ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన యంగ్ హీరో శ్రీహరి!

Published on Jul 7, 2021 8:51 pm IST

విజయ్ కుమార్ యల్కోటి దర్శకత్వం లో వైపిబిఆర్ ఆర్ట్స్ మరియు శ్రీ పెరిగేలా సద్గురు రాణి ప్రెజెంట్స్ తో ప్రశాంత్ కుమార్ పరిగెల సతీశ్, శ్రీధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ధర్మహ. స్లమ్ బ్యాక్ డ్రాప్ లో చిన్నపిల్లలు, భామ్మ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే చిత్ర యూనిట్ శ్రీహరి కుమారుడు అయిన మేఘంశ్ ను కలిశారు. తక్కువ వయసు ఉన్న పిల్లలతో సొసైటీ కి మెసేజ్ ఇచ్చేలా యువ దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

అయితే దర్శకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, అడగ్గానే ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు హీరో మేఘంష్ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఈ కథను నమ్మి ముందుకు వచ్చిన నిర్మాతకు కి చాల థాంక్స్ అని అన్నారు. అయితే ఇండస్ట్రీ లో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కూడా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడివరకు వచ్చే వాడ్ని కాదు అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ నరహరి కట్ట, ఎడిటింగ్ వినయ్, సాగర్ ఉదగండ్ల చేయగా, సంగీతం ప్రశాంత్ కుమార్ పరిగెల, సతీశ్, శ్రీధర్ లో అందించారు.

సంబంధిత సమాచారం :