శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న మొదటి సినిమా పడి పడి లేచే మనసు. శర్వానంద్ హీరోగా , సాయి పల్లవి హీరోయిన్ గా హను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కలకత్తాలో ప్రారంభం అయ్యింది. లవ్ స్టోరి గా వస్తోన్న ఈ సినిమా కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఈ సినిమా కోసం శర్వానంద్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించబోతున్నాడు. అంతేకాదు ఈ మూవీ కోసం 10 కిలోల బరువు తగ్గాడంట ఈ హీరో. ఆర్మీ బ్యాక్ డ్రాఫ్ లో తెరకేక్కబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని సమాచారం. అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో హను రాగాపుడి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


