
‘అవును’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘అనామిక’ సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న యువ హీరో హర్షవర్ధన్ రాణే. సినిమాలతో పాటు సమాజ సేవపై ఈ యువ హీరోకు ఆసక్తి ఎక్కువే. మార్చి 8, ఆదివారం నాడు హైటెక్ సిటీ సమీపంలో ‘పోటేన్స్ క్రాస్ ఫిట్’లో ఓ చారిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.
‘షర్ట్ ఆఫ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రాణే తన షర్ట్ విప్పుతున్నాడు. సినిమాల్లో తను వేసుకున్న షర్ట్స్ అన్నిటిని ఇక్కడ అమ్ముతారు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును స్వాతి అనే పేద విద్యార్ధి చదువు కోసం అందజేస్తారు.
తాజాగా హర్షవర్ధన్ రాణే నటించిన ‘అవును 2’ సినిమా షూటింగ్ పూర్తయింది. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

