ఈనెలలో తన కొత్త సినిమాల గురించి చెబుతానంటున్న యంగ్ హీరో !

ఈనెలలో తన కొత్త సినిమాల గురించి చెబుతానంటున్న యంగ్ హీరో !

Published on Mar 6, 2019 2:00 PM IST

Nithin1
‘శ్రీనివాస కళ్యాణం’ తరువాత యంగ్ హీరో నితిన్ ఇంత వరకు తన కొత్త చిత్రాన్ని మొదలు పెట్టలేదు. దాంతో ఫ్యాన్స్ తన కొత్త చిత్రం గురించి అప్డేట్ ఇవ్వాలని నితిన్ కు డైరెక్ట్ గా మెసేజ్ చేశారు. తాజాగా తన సినిమాల గురించి నితిన్ స్పందిస్తూ ఈ నెల చివర్లో నా కొత్త సినిమాల గురించి చెపుతాను ప్రామిస్. ప్రస్తుతం అన్ని స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే వున్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలతో రానున్నాని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక అందులో ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుములతో తన కొత్త చిత్రాన్ని చేయడం దాదాపుగా ఖరారు అయ్యింది. ఈచిత్రానికి ‘భీష్మ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నితిన్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించనుడగా ఛలో ఫేమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.

ఇక నితిన్ ఈచిత్రం తోపాటు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తో కూడా ఒక చిత్రాన్ని చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి ఈ నెలలో క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు