12వ తరగతి పాసైన కుర్ర హీరోయిన్..!

Published on Aug 1, 2021 12:06 am IST

ఒక్కసారి సినిమా ఇండస్టీలోకి అడుగుపెడితే చాలు బిజీ లైఫ్ కారణంగా చాలా మంది నటీ నటుల అశయాలు ఆశలగానే మిగిలిపోతుంటాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి రావాల్సి వస్తుండడంతో వారు కనీసం పై చదువులు చదువుకునేందుకు కూడా అవకాశం ఉండడం లేదు. దీంతో కొంత మంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. కానీ ఓ కుర్ర హీరోయిన్ మాత్రం తనకు చదువంటే ఇస్టమని, ఖచ్చితంగా పై చదువులు చదువుతానని చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల బేబ్స్‌ లాంటి సీరియల్స్‌తో పాటు సంజు చిత్రంలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి అష్నూర్‌ కౌర్‌. తాజాగా ప్రకటించిన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ అమ్మడు 94 శాతం మార్కులతో పాసయ్యింది. పదో తరగతిలో నాకు 93 శాతం మార్కులు వచ్చాయని, 12వ తరగతిలో అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలని కష్టపడి చదివానని చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం ఆపనని ఖచ్చితంగా ఉన్నత చదువులు చదువుతానని అఘ్నార్ తెలిపింది. ఏదేమైనప్పటికీ చదువుపై ఈ అమ్మడుకు ఉన్న ఇంట్రెస్ట్‌కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :