మెగాహీరో మూవీ టీమ్ పై హీరోయిన్ అసంతృప్తి….మ్యాటర్ ఏమిటంటే ?

Published on Mar 23, 2023 2:00 am IST

మెగా సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై ప్రస్తుతం తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విరూపాక్ష. ఇప్పటికే ఈమూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సంయుక్తా కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ ద్వారా మూవీ టీమ్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు.

విరూపాక్ష టీమ్ తో టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తుండడం ఎంతో సంతోషంగా అనిపించిందని, అయితే నేడు ఉగాది సందర్భంగా మూవీ టీమ్ నుండి నా క్యారెక్టర్ కి సంబంధించి స్పెషల్ పోస్టర్ వస్తుందని ఆశించాను కానీ రాలేదు, దీనితో ఎంతో డిజప్పాయింట్ అయ్యాను అంటూ ఆమె పోస్ట్ చేసారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర టీమ్, క్షమించాలి మాకు కొద్దిగా టైం ఇవ్వండి తప్పకుండా పోస్టర్ రిలీజ్ ఉంటుందని రిప్లై ఇచ్చారు. కాగా నేడు ఉగాది విషెస్ తెలియచేస్తూ విరూపాక్ష టీమ్ సాయి ధరమ్ తేజ్ స్పెషల్ పోస్టర్ ని మాత్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈమూవీ ని అన్ని కార్యక్రమాలు ముగించి ఏప్రిల్ 21న సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఇది పబ్లిసటీ స్టంట్ అంటూ కొందరు ఆడియన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :