లెజెండరీ యాక్టర్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను అలాగే ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ‘కపిల్ దేవ్ ‘జీవిత కథతో మరో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న యువ నిర్మాత విష్ణు ఇందూరి తాజా గా ఇంకొక ఆసక్తికర బయోపిక్ కు శ్రీకారం చుట్టారు .
అలనాటి నటి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి’ పురిచ్చి తలైవి’ జయలలిత బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విష్ణు ఇందూరి ఈ బయోపిక్ వార్తను ధ్రువీకరించారు . మరి జయలలిత పాత్రలో ఎవరిని తీసుకుంటారో చూడాలి . గత కొన్ని రోజులుగా ఈ పాత్రలో హిందీ హీరోయిన్ విద్యా బాలన్ నటించనుందని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు వాటిపై స్పష్టత లేదు . ప్రస్తుతం విద్యా బాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ తల్లి పాత్రలో నటించనుంది .
