యంగ్ టైగర్ డెడికేషన్ మ్యాటర్స్..ఇది చూసారా?

Published on Oct 18, 2020 3:56 pm IST

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే అనేక అంశాల్లో పలు ప్రామాణికాలు ఉంటాయి. అలా హీరోల విషయానికి వస్తే ప్రతీ సినిమా సినిమాకు కొత్తదనాన్ని ఆడియెన్స్ మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటి వైవిధ్యతను ఎందరో స్టార్ హీరోలు కూడా చూపించారు. కానీ అందులో మన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పాలి.

తన ఫిట్నెస్ పట్ల తారక్ చూపిన డెడికేషన్ నిజంగా అద్భుతం. తన సినిమా కోసం ఎంతవరకు అయినా వెళ్లగలడు అని తన స్టన్నింగ్ లుక్స్ తో చాలా సినిమాల్లో అబ్బురపరిచాడు. ముఖ్యంగా తారక్ నటించిన లాస్ట్ చిత్రం “అరవింద సమేత వీర రాఘవ” కోసం ప్రిపేర్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ అయితే ఎన్టీఆర్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఆ లుక్ కు సంబంధించి అప్పట్లో కొన్ని ఫొటోస్ వచ్చాయి కానీ తర్వాత తారక్ పుట్టినరోజు సందర్భంగా అతని ట్రైనర్ ఒక స్పెషల్ పిక్ ను వదిలితే దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో ఫోటో బయటకొచ్చింది. ఆ సమయంలో తన ఫోటో గ్రాఫర్ తో తారక్ షర్ట్ లెస్ గా కనిపించి మరోసారి ఆశ్చర్యపరిచాడు. జిమ్ లో సూపర్బ్ బాడీతో తన ఫోటోగ్రాఫర్ తో కలిసి పోజిచ్చిన ఈ ఫోటో మరో సారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు తారక్ చేస్తున్న RRR లో కూడా స్టన్నింగ్ లుక్ ఉంది మరి ఇందులో ఎలా కనిపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More