యూత్ కి నచ్చిన ‘ప్రేమకు రెయిన్ చెక్’ !

యూత్ కి నచ్చిన ‘ప్రేమకు రెయిన్ చెక్’ !

Published on Sep 8, 2018 11:00 AM IST

premaku raincheck

అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మౌనిక హీరో హీరోయిన్లు గా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. నిన్న విడుదలైన ఈ చిత్రానికి యువత నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్రెష్ గా మంచి క్వాలిటీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

దీపక్ కిరణ్ సంగీతం అందించిన ఈచిత్రాన్నీ స్టోన్ మీడియా ఫిలిమ్స్ నిర్మించింది. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పకుడిగా సమర్పకుడిగా వ్యవహరించారు. సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు తదితరులు ఈచిత్రంలోముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు